
శ్రీవాసవీ ఆలయంలో సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి కొత్తగా ప్రకటించుకున్న పాలకవర్గ ప్రథమ సమావేశాన్ని ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. పెండేల వెంకట్రావు అధ్యక్షత వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదినం సందర్భంగా ఆలయంలో మే నెల 5,6,7 తేదీల్లో జన్మదిన ఉత్సవాలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. న్యాయవాది మద్ది మల్లికార్జునరావును కమిటీ పాలకవర్గ న్యాయసలహాదారుగా నియమించడానికి తీర్మానించినట్టు వివరించారు. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల ముగింపు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగిశాయి. వారోత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం నగరంపాలెంలోని ఫొనిక్స్ మాల్‌లో సిబ్బంది అగ్నిప్రమాదాల పట్ల అవగాహన కలిగించారు. అగ్నిమాపకశాఖ రేంజ్ ఫైర్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌వో) ఎంఏక్యూ జిలాని, జిల్లా పోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ రత్నమన్మోహన్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి. శ్రీనివాసులరెడ్డి, ఫొనిక్స్‌మాల్ మేనేజర్ చైతన్య, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక ప్రమదాలు సంభవించిన సమయంలో ఏ విధంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. డెమో నిర్వహించి పరికరాల గురించి తెలియజేశారు.

శ్రీవాసవీ ఆలయంలో సమావేశం