
అందరి కృషితోనే భూ పరిరక్షణ సాధ్యం
గుంటూరు ఎడ్యుకేషన్: భూమితోపాటు భూమిపై పచ్చదనాన్ని కూడా పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వైడీ రామారావు అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో మంగళవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామారావు మాట్లాడుతూ భూమి పరిరక్షణకు అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. జిల్లా అటవీశాఖాధికారి హిమ శైలజ మాట్లాడుతూ విరివిగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రరాజు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నజీనా బేగం , ఇంటాక్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమాని, పాఠశాల ప్రిన్సిపల్ హేమాంబ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, రెడ్ క్రాస్ వలంటీర్లు పాల్గొన్నారు.