Police Boss Said No to Mutual Transfer of Two Inspectors Under Warangal Police Commissionerate - Sakshi
Sakshi News home page

అయోమయంలో ఆ.. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు

Published Fri, Jul 21 2023 1:24 AM | Last Updated on Fri, Jul 21 2023 2:27 PM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు చుక్కెదురైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖలో బదిలీలు ముమ్మరమయ్యాయి. తాము కూడా ఎన్నికల ఎఫెక్ట్‌ బదిలీలో ఉంటామని భావించిన ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నియోజకవర్గంలోనే మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌కు సిద్ధమయ్యారు.

ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నందున మ్యూచువల్‌ బదిలీ ప్రణాళికకు సదరు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి ఓకే అన్నారు. ఇందుకు ఆ ఇన్‌స్పెక్టర్లు చెరో రూ.10లక్షలు మొత్తం రూ.20 లక్షలు సమర్పించుకున్నట్లు తెలిసింది. ఆతర్వాత ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు పోస్టింగ్‌లు ఖాయమనుకుని రెట్టింపు ఉత్సాహంతో సదరు ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో పోలీస్‌ బాస్‌ను కలిశారు.

అసలు ట్విస్ట్‌ ఇక్కడే మొదలైంది. ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఇతర సమీకరణాల కారణంగా పోలీస్‌ పోస్టింగ్‌లను సైతం ప్రభుత్వ పెద్దలే నిశితంగా చూస్తుండడం.. దీంతోపాటు ఆ ప్రజాప్రతినిధి ‘పెత్తనం’ నడవకపోవడంతో మ్యూచువల్‌ బదిలీకి పోలీస్‌ బాస్‌ నో అని చెప్పినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు చేసేది లేక ఒకరి ముఖం ఒకరు చూసుకుని లబోదిబోమని మొత్తుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరిపై ఎస్‌బీ అధికారులు.. సీపీకి నివేదికలను సైతం సమర్పించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement