దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు
● డీఆర్‌ఓ వైవీ గణేశ్
హన్మకొండ అర్బన్: దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016పై అవగాహన కల్పిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, విద్యా, రెవెన్యూ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వైవీ.గణేశ్ మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాక్‌లాగ్ పోస్టులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వారికి జీఓ నంబర్ 31 ప్రకారం.. ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం, 60 శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు ఎన్నికల విధులకు మినహాయింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. విద్యాశాఖలో ఉపాధ్యాయ బదిలీల్లో నిబంధనల మేరకు సదరం సర్టిఫికెట్ ఆధారంగా ప్రాధాన్యం కల్పించేందుకు సంబంధిత అధికారులకు సూచించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, డీడబ్ల్యూఓ జయంతి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment