సాగులో నూతన పద్ధతులు పాటించాలి
కిసాన్ మేళాలో కలెక్టర్ సత్యశారద
మామునూరు: రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే ఖర్చులు తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజన్న ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగుపై గురువారం కిసాన్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూత న పద్ధతులతో వ్యవసాయం చేయాలని కోరారు. జిల్లా వ్యసాయ అధికారి అనురాధ, డాక్టర్ రాజన్న, కిషన్‌కుమార్, అరుణ్ జ్యోతి, సౌమ్య, శశాంక్, హర్ష, సాయి చంద్, సుశ్రుత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment