
‘అకుట్’ ఎన్నికలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్) ఎన్నికలకు యూనివర్సిటీ అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. నా మినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2025–2027 సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరగబోతున్నా యి. ఈనెల 24న నామినేషన్ల ప్రక్రియ ముగియబోతుంది.అధ్యక్షుడు1, ఉపాధ్యక్షులు రెండు, జనరల్‌సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 1, కోశాధికారి 1, పదిమంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 27న ఉంటుంది. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. ఈనెల 28న ఓటర్ల (అధ్యాపకులు) జాబితా వెల్లడిస్తారు. మార్చి 4న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేయూలోని సెనేట్‌హాల్‌లో, కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో పో లింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మార్చి 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.
ఒకప్పుడు అకుట్ ఎన్నికలంటే పోటాపోటీ..
అకుట్ ఎన్నికలంటే ఆచార్యుల మధ్య అధ్యక్ష పదవి కి, జనరల్ సెక్రటరీ ఇతర పదవులకు కూడా పోటీ నెలకొని రెండు ప్యానల్స్‌గా ఎన్నికల బరిలో ఉండేవారు. కొద్దిరోజులపాటు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో ఎన్నికల సందడి ఉండేది. అధ్యాపకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అకుట్ ఎన్నికలంటే ప్రస్తుతం అంత ఆసక్తి ఉన్నట్లు కనబ డడం లేదు. ప్రస్తుతం 77మంది (అసిస్టెంట్, అసో సియేట్, ప్రొఫెసర్లు) ఉన్నారు. జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, జీయాలజీ విభాగం ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి అధ్యక్ష పదవికి నా మినేషన్‌లు దాఖలు చేశారు. బయోటెక్నాలజీ విభా గం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు జనరల్ సెక్రటరీ పదవికి, మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు అధ్యక్ష పదవికి, జనరల్ సెక్రటరీ పదవికి రెండింటికి ఎన్నికల బరిలోఉండబోతున్నారని యూనివర్సిటీలో చర్చగా ఉంది. ఆయా వివిధ పదవులకు ఎంతమంది పోటీచేస్తారనేది ఈనెల 24న నామినేషన్ చివరి రోజు వెల్లడికానుంది.
నేటితో ముగియనున్న నామినేషన్‌ప్రక్రియ
మార్చి 4న ఓటింగ్..
Comments
Please login to add a commentAdd a comment