భూపాలపల్లి అర్బన్: నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని మనవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ బృందం ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించింది. అనంతరం తిరుపతయ్య మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు కొత్త హరిబాబు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలిపారు. దీనిపై మరింత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు బాదావత్ రాజు, హరికృష్ణ, దిలీప్, ప్రసాద్, సమ్మయ్య, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment