● నిందితుల కదిలికలపై పోలీసుల దృష్టి
● పరిచయస్తులే దాడికి తెగబడ్డారా..!
ఖిలా వరంగల్: వరంగల్ భట్టుపల్లి రహదారిపై అమ్మవారి పేట క్రాస్ వద్ద గురువారం రాత్రి వైద్యుడు గాదే సుమంత్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కొంత మేర పురోగతి సాధించినట్లు తెలిసింది. ఈకేసును పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదిలికలపై దృష్టిసారించారు. ఘటనా స్థలిలో లభించిన ఆధారాల ప్రకారం హత్యాయత్నానికి పాల్పడింది ఎవరై ఉంటారన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. మొబైల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. అయితే హత్యాయత్నానికి పాల్పడిన తర్వాత ఘటనా స్థలి నుంచి నిందితులు ఎటువైపు పారిపోయారు..? ఎలా వెళ్లి ఉంటారు.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
పరిచయస్తులే దాడికి తెగబడ్డారా..!
సుమంత్‌రెడ్డి ఇతర జిల్లాలో క్లినిక్ ఏర్పాటు చేయగా అక్కడ ఓ వ్యక్తితో ఏర్పడింది. అతడే ఈదాడికి ఒడిగట్టినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులు ఉపయోగించిన బైక్ ఓ కానిస్టేబుల్‌ది కావడం.. నిందితులిద్దరు కానిస్టేబుల్ బైక్ చోరీ చేసి హత్యాయత్నంలో ఉపయోగించి ఉంటారా..? లేదా కాని స్టేబుల్ సైతం దాడిలో పాల్గొన్నాడా.. అనే దానిపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే వైద్యుడితో సన్నిహితంగా ఉన్న కానిస్టేబుల్, ఇతరుల ఇంటికి పోలీసులు చేరుకుని, పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment