సమావేశంలో పాల్గొన్న సీవీ ఆనంద్ తదితరులు
హైదరాబాద్: గ్రేటర్ అంతటా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఆయా వాహనాలు ఉన్న స్థానం, నిర్వహణ సేవల పర్యవేక్షణ కోసం వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించాలని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ బృందం నిర్ణయించింది. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి, హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన శనివారం టీఎస్‌పీఐసీసీసీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఉమెన్ సేఫ్టీ అదనపు డీజీ శిఖా గోయల్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్రై కమిషనర్లలో కొత్త భరోసా కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. అలాగే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ), పెలికాన్ సిగ్నళ్లు, సీసీటీవీ కెమెరాలతో సహా సేఫ్టీ సిటీ ప్రాజెక్ట్‌లోని పలు అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment