
హైదరాబాద్: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 10 మిలియన్ల మంది బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్నారని ప్రముఖ ఆన్‌లైన్ బస్–టికెటింగ్ వేదికై న ‘అభిబస్’ వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో పీక్ ట్రావెల్ సీజన్‌తో అధిక విమాన ప్రయాణ ఖర్చులు, రైలు టిక్కెట్ల పరిమిత లభ్యత వంటి కారణాలతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులను ఎంచుకున్నారని వారు పేర్కొన్నారు.
ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ నుంచి గోవాకు రౌండ్–ట్రిప్ రైలు టిక్కెట్ల ధర సుమారుగా రూ.10 వేలు ఉండగా, బస్సు ప్రయాణికులు అదే గమ్యస్థానానికి దాదాపు రూ.2 వేలకే చేరుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–గోవా, బెంగుళూరు–చైన్నె, చైన్నె–కోయంబత్తూర్, లక్నో–దిల్లీ, దిల్లీ–డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలను కలిపే వాటితో సహా ప్రముఖ మార్గాలలో బస్సు ప్రయాణంలో పెరుగుదల గణనీయంగా చోటు చేసుకుందని అభిబస్ సీఓఓ రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాకుండా పొడిగించిన వారాంతంలో ఇతర మార్గాలలో 30 శాతం వృద్ధి కనిపించిందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment