రాష్ట్రపతి నుంచి ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు అందుకుంటున్న దేవర మనోజ్ ఖన్నా
హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవర మనోజ్ ఖన్నాకు ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు లభించింది. గోషామహల్ నియోజకవర్గంలోని గాంధీభవన్ ప్రాంతానికి చెందిన దేవర మనోజ్ ఖన్నా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా ఉంటూ పర్యావరణ కార్యక్రమాలపై 7 లక్షల మంది విద్యార్థులకు 650 కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు.
1300 మొక్కలు నాటడంతో పాటు 160 యూనిట్ల రక్తదాతలను సమీకరించడం, కోవిడ్–19 లాక్‌డౌన్ సమయంలో నిరుపేద పిల్లలు, గ్రామీణ కుటుంబాలకు నిత్యవసరాల వస్తువుల పంపిణీ, పలు విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేశారు. వీటికి గుర్తింపుగా దేవర మనోజ్ ఖన్నాకు ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మనోజ్ ఖన్నా మాట్లాడుతూ..2016వ సంవత్సరం నుండి తాను నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
జాతీయస్థాయిలో రాష్ట్రపతి అవార్డు పొందడం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. పలు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించి 5 వేల కిట్స్‌లను పంపిణీ చేశానన్నారు. జీవితాంతం సామాజిక సేవా కార్యక్రమాలకే అంకితమవుతానన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్, పటేల్‌నగర్‌తో పాటు గోషామహల్ నియోజకవర్గంలో పలువురు మనోజ్ ఖన్నాను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment