నాగోలు: గురుకుల పాఠశాలలో కార్పెంటర్ పనులు చేయగా అతని బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకున్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన మేరకు.. నాగోలు పరిధిలోని బండ్లగూడ, ఆనంద్‌నగర్‌లో బాలానగర్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఘట్‌కేసర్‌కు చెందిన బి. వెంకటాచారి వివిధ కార్పెంటర్ పనులు చేశాడు.
రూ. 1,28,592 బిల్ అయింది. బిల్లు కోసం ప్రిన్సిపల్ అరుణను కలవగా తనకు రూ. 25 వేలు ఇస్తే బిల్లు మంజారు చేస్తానని చెప్పింది. తన బ్యాంక్ అకౌంట్‌కు నగదు జమ చేయాలంటూ బ్యాంక్ ఖాతా వివరాలను వెంకటాచారికి అందించింది. దీంతో వెంకటచారి ప్రిన్సిపాల్ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 25 వేలు నగదు జమ చేశాడు. ఆ తరువాత ప్రిన్సిపాల్ మరి కొంత నగదు డిమాండ్ చేయడంతో కార్పెంటర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఏసీబీ అధికారులు సోమ వారం రాత్రి బండ్లగూడ ఆనంద్‌నగర్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. నగదు బదిలీ సంబంధించిన డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లంచం తీసుకున్నట్లు సాక్ష్యం రికార్డులో ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్ అరుణను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment