
హాల్‌టికెట్ కోసం విద్యార్థి ఆందోళన
● పూర్తి ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం నిరాకరణ ● విషయం వైరల్ కావడంతో ఇచ్చేసిన వైనం
మీర్‌పేట: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతుండగా పరీక్షకు సిద్ధం కావాల్సిన ఓ విద్యార్థి హాల్‌టికెట్ ఇవ్వాలని కళాశాల ఎదుట బైఠాయించాడు. ఈ సంఘటన మీర్‌పేట పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన వెంకట పవన్ బాలాపూర్ చౌరస్తాలోని శ్రీ వాగ్ధేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూర్తి ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో వెంకట పవన్ మంగళవారం రూ.5వేలు చెల్లించాడు. పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ హాల్‌టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పవన్ కళాశాల ఎదుటే కూర్చొని హాల్‌టికెట్ ఇవ్వాలని వేడుకున్నాడు. విషయం కాస్తా స్థానికంగా వైరల్ కావడంతో యాజమాన్యం రూ.5వేలు తిరిగిచ్చేయడంతో పాటు హాల్‌టికెట్ అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment