బేబీ షార్క్ డ్యాన్స్.. పిల్లలు తెగ వినే ఈ పాట గురించి చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకు వెయ్యి కోట్లమందికి పైగా వీక్షించారు కాబట్టి. అంటే ఒకరకంగా చూస్కుంటే ప్రపంచ జనాభానే ఈ పాట క్రాస్ చేసిందన్నమాట!!
యస్.. దక్షిణ కొరియా ఎడ్యుకేషన్ అండ్ రైమ్స్ క్రియేట్ కంపెనీ పింక్‌ఫాంగ్ రూపొందించిన బేబీ షార్క్ సాంగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూస్ సాంగ్ ఘనత దక్కించుకుంది. తాజాగా పది బిలియన్‌ల వ్యూస్‌ను దాటేసి.. యూట్యూబ్‌లో ఎక్కువమంది చూసిన వీడియో ఘనత దక్కించుకుంది. ప్రపంచ జనాభానే దాదాపు 7.8 బిలియన్ కి అటుగా ఉంటే.. 10 బిలియన్ వ్యూస్ ఎలాగబ్బా అని అనుమానం రావొచ్చు. యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం.. అదనంగా ఆ 2 బిలియన్ వ్యూస్ జత అయ్యాయన్నమాట.
దక్షిణ కొరియాకు చెందిన “పింక్‌ఫోంగ్” అనే సంస్థ రూపొందించిన “Baby Shark” అనే వీడియో ఈ ఘనత సాధించింది. ఇద్దరు చిన్న పిల్లలు ‘‘బేబీ షార్క్ డు డు డు..’’ అంటూ లయబద్ధంగా స్టెప్పులు వేయడం, ఆ వెనుక బేబీ షార్క్‌తో పాటు మామ్మీ, డాడీ, గ్రాండ్‌పా, గ్రాండ్‌మా షార్ట్‌లు రావడం.. ఇలా సాగుతుందని ఆ పాట. కొరియన్-అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ తన 10 ఏళ్ల వయస్సులో ఈ సాంగ్ పాడింది. 2016లో ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పింక్‌ఫాంగ్.
కాగా 2020లో నవంబర్ లో ఈ వీడియో సాంగ్ 7 బిలియన్ వ్యూస్ దాటి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ప్యూర్టో రికన్ పాప్ స్టార్లు లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీ కంపోజ్ చేసిన ‘డెస్‌పాసిటో’ యూట్యూబ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరికొన్ని ఆసక్తికర విషయాలు
- ఇదొక క్యాంప్‌ఫైర్ సాంగ్ అని, సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించే కొందరు ఈ పాట ప్రచారానికి మూల కారణం అని చెప్తుంటారు.
- 2016లో PINKFONG యూట్యూబ్‌ఛానెల్‌లో అప్‌లోడ్ అయ్యింది.
- సాంగ్ మొత్తం రన్ టైం 2 నిమిషాల 16 సెకండ్లు కాగా.. జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే లిరిక్స్, ఎఫెక్ట్‌లు ఉంటాయి.
- 2017లో ఇండొనేషియాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు, కుటుంబాలు ఈ సాంగ్‌ను వైరల్ చేశాయి.
- 2018లో టిక్ టాక్ ద్వారా #BabySharkChallenge వైరల్ కావడంతో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.
- బేబీ షార్క్.. 2021లో బేబీ షార్క్‌స్ బిగ్‌షోగా నిక్కెలోడియన్ ప్రీ స్కూల్ సిరీస్‌గా అలరించింది.
- అంతేకాదు దీనిపై ఫీచర్ ఫిల్మ్ తీసే ఆలోచనలో ఉంది నిక్కెలోడియన్.
- డిసెంబర్ 2021.. సిక్స్ పీస్ ఎన్‌ఎఫ్‌టీ కలెక్షన్ ఘనత సాధించింది.
- బిల్‌బోర్డ్ హాట్ 100లో 32వ స్థానంతో ఎంట్రీ ఇచ్చి.. జనవరి 12, 2019న హయ్యెస్ట్ పొజిషన్ సాధించింది.
- సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.
- విచిత్రం ఏంటంటే.. ఈ పాట రాసిందెవరో క్లారిటీ లేకపోవడం!!.
- పింక్‌ఫోంగ్ పేరెంట్ కంపెనీ స్మార్ట్‌స్టడీ దగ్గర ఈ సాంగ్ రైట్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment