బ్రెసీలియా : గజిబిజి బతుకుల గందరగోళంలో టెన్షన్లు.. వాటితో పాటు విపరీతమైన కోపాలు మామూలైపోయాయి. కొన్నికొన్ని సార్లు కంటికి కనపడని శత్రువుతో.. బయటికి కనపడే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంట్లో కోపాలను బయట, ఆఫీసులో కోపాన్ని ఇంట్లో చూపిస్తుంటారు కొందరు. అలాంటప్పుడు ప్రతీ చోట లేని పోని సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో మరింత సతమతమయిపోతుంటారు. ఏం చేయాలో తెలియక మధనపడిపోతుంటారు. అలాంటి వారికోసమే బ్రెజిల్‌లోని సావో పాలోలో ఓ ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అదే ‘రేజ్ రూమ్’. ఈ రూములో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇలా చాలా వస్తువులు ఉంటాయి. వాటిలో మీ ఫ్రస్టేషన్‌కు కారణమైన వ్యక్తులు లేదా విషయాలను ఊహింకుని.. ఫ్రస్టేషన్నంతా వాటి మీద చూపించొచ్చు. ( పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి )
కోపం చల్లారేవరకు.. మీ ఇష్టం వచ్చినట్లు వాటిని పగుల గొట్టి పిండి చేయోచ్చు. వాటిని పగుల గొడుతున్న సమయంలో మీకెలాంటి గాయాలుకాకుండా మీ శరీరానికి రక్షణగా ఉండేలా ఓ కవచాన్ని కూడా ఇస్తారు. దెబ్బలు తగులుతాయనే భయం కూడా ఉండదు. ప్రస్టేషన్‌లో ఉన్న చాలా మంది ఇక్కడికి క్యూ కడుతున్నారు. అక్కడి వస్తువులపై తమ కోపాన్ని చూపి కుదుటపడ్డ మనసుతో వెనక్కు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment