లండన్: ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిని యావత్ ప్రపంచమంతా ఖండిస్తోంది. కానీ లండన్‌లో హమాస్ మద్దతుదారులు కొందరు బహిరంగంగానే సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటు.. లండన్ పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'హమాస్ మద్దతుదారులు కొందరు బహిరంగంగా సంబరాలు చేసుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరం. తీవ్ర నిరసనలకు దారి తీయొచ్చు. లండన్ పౌరులను ఇబ్బంది పెట్టే ఇలాంటి చర్యలు ఏ మాత్రం సమంజసం కాదు. వాటిని అడ్డుకునేందుకు పోలీసు నిఘాని పెంచాం’’ అని లండన్ పోలీసులు ట్వీట్ చేశారు.
హమాస్ ఉగ్రవాదుల సానుభూతిపరులు కొందరు లండన్‌లో సంబరాలు చేసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇజ్రాయెల్‌లో మహిళలపై దారుణంగా దాడి చేస్తున్నారు.. ఈ దాడులు మనదాకా రావని భావించడం మూర్ఖత్వం అంటూ నెటిజన్లు ట్విట్లు చేస్తున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.
ఇదీ చదవండి: అసెంబ్లీలో పాసైనా.. గవర్నర్ తిరస్కరించారు!
Comments
Please login to add a commentAdd a comment