దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో నియో కోవ్ ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. (చదవండి: New Virus NeoCov: మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి )
ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్‌తో అల్లాడిపోతున్నప్రజలకు నియోకోవ్ మరింత తలనొప్పిగా మారునుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకుంటే ఈ వైరస్ వల్ల భవిష్యత్తులో మనుషులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్‌లోని వేరియంట్లు సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎస్‌ఏఆర్‌ఎస్) వరకు వ్యాధులకు కారణమయ్యే వైరస్‌కు సంబంధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన నియో కోవ్ వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతోపాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని వూహాన్ ల్యాబ్ సైంటిస్టులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment