వచ్చే ఏడాది(2024) నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత ఫిబ్రవరిలో జరిగిన డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో రెండవసారి అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని పార్టీ సభ్యులను కోరారు. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రచార వేగం కొనసాగించాలని తన మద్దతుదారులకు సూచించారు. కాగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అవుతారని, రిపబ్లికన్ల తరపున పోటీచేస్తే ఎన్నికల్లో ఓడిపోతారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
పెరుగుతున్న ఆరోపణలపై ట్రంప్ వ్యంగ్యం
తనపై వస్తున్న ఆరోపణల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా తన పాపులారిటీ కూడా పెరుగుతోందని, ఇది ఎన్నికల ప్రచారానికి ఎంతగానో దోహదపడుతుందని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అతని మద్దతుదారులు కూడా ట్రంప్ వ్యాఖ్యలకు వంతపాడుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తనకు కావాల్సింది ఒక్క ఆరోపణ మాత్రమేనని ట్రంప్ వ్యంగ్య ధోరణిలో వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల నుంచి అభ్యర్థిత్వానికి తాను ముందున్నానని, తనపై క్రిమినల్ కేసుల ఫలితం ఎలా ఉన్నా రేసులో ఉంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
‘ఆరోపణలతో ప్రచారానికి ఉత్సాహం’
తనపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు, తన ఎన్నికల ప్రచారం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే తనకు ఆరోపణలు అవసరమని సరదాగా అన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలేవీ చెల్లవని, సరైనవి కాదని ట్రంప్ మరోమారు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ప్రత్యర్థుల నిరాశ నుంచి వచ్చినవేనని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ.. ‘మీరు నన్ను వెంబడిస్తే.. నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను’ అని వ్యాఖ్యానించారు.
అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ విజేతగా నిలిచారు. అయితే ఈ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగలేదంటూ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పలు విమర్శలు చేశారు. అనంతరం అమెరికాలోని కాపిటల్ హిల్‌పై వారు దాడి చేశారు. ఇటువంటి ఎదురుదాడుల మధ్య 2020, జనవరి 20 న జో బైడెన్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment