వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ట్విటర్ షాక్ ఇచ్చింది. కరోనాపై "తప్పుదోవ పట్టించే , హానికరమైన సమాచారాన్ని" పోస్ట్ చేశారంటూ జూనియర్ ట్రంప్ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది.
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన తప్పుడు సమాచారంతో కంపెనీ విధానాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను పోస్ట్ చేశారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్‌ను 12 గంటల పాటు బ్లాక్ చేసింది. "ఈ ట్వీట్ ఇకపై అందుబాటులో లేదు" అని ట్యాగ్‌ను యాడ్ చేసింది. తమ విధానాల మేరకు ఈ చర్య తీసుకున్నామని ట్విటర్ ప్రకటించింది. అయితే ఇది సస్పెన్షన్ కాదని, సంబంధిత ట్వీట్ తొలగించే వరకు తాత్కాలిక లాకౌట్ కొనసాగుతుందని ట్విటర్ ప్రతినిధి ఇయాన్ ప్లంకెట్ వివరించారు. దీంతో ట్రంప్ జూనియర్ కొత్త సందేశాలను పోస్ట్ చేయడం గానీ, ఇతర ట్వీట్లకు స్పందించడం గానీ చేయలేరు.
కోవిడ్-19 దాని చికిత్సలపై అబద్ధాలు సందేహాస్పద వాదనలతో వీడియోను ట్రంప్ జూనియర్ షేర్ చేశారని ట్విటర్ ఆరోపించింది.ప్రధానంగా యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకంపై తప్పుడు సమాచారాన్ని ఈ వీడియోలో పొందుపర్చడం వివాదం రేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం వినియోగంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో తప్పుడు సమాచారాన్ని అందించారనేది ప్రధాన ఆరోపణ.
Disturbing: https://t.co/c9vxjHVn0s
— Joe Concha (@JoeConchaTV) July 28, 2020
Comments
Please login to add a commentAdd a comment