వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో వలసదారులకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ట్రంప్ తీసుకుంటున్నారు. ఇక, తాజాగా వలసదారులపై మరో కీలక ప్రకటన చేశారు.
డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి. అమెరికాలో ఏయే దేశాల వారైతే ఉన్నారో.. వారిని వెంటనే తమ దేశాలు వెనక్కి పిలిపించుకోవాలి. ఇలా జరగకపోతే.. ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపి వేయడం జరుగుతుంది. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు జరగవు. అన్ని వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తాం. ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వలసదారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అక్రమ వలదారులు ఎవరున్నా వాళ్ళపై సైనిక చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చట్టాలను అనుసరించే ఎవరైనా తమ దేశంలో ఉండేలా చూసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆహ్వానం వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment