ప్రతీకాత్మక చిత్రం
ఈ ప్రపంచంలో ఒకొక్కరిదీ ఒక్కో లైఫ్ స్టైల్.. అమెరికన్లది ఓ రేంజ్‌లో ఉంటుంది.. మనది ఒకలా ఉంటుంది.. ఉగాండాలాంటి పేద దేశాల వాళ్లది మరొకలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమ్మీద అందరూ అమెరికా వాళ్లలా బతకాలంటే.. ఏం కావాలో తెలుసా? ఐదు భూములు కావాలి.. నిజం! అంటే తిండి, నీళ్లు, కరెంటు, ఇతర వనరులన్నీ వాళ్ల రేంజ్‌లో అందరూ వాడాలంటే.. ఈ భూమి మీద ఉన్న వనరులు సరిపోవు.. ఐదు భూగ్రహాల మీద ఉన్నన్ని వనరులు కావాల్సిందే.
గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్‌వర్క్ అనే ఎన్జీవో విస్తృతమైన సర్వే చేసి రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, లగ్జెంబర్గ్, కొన్ని గల్ఫ్ దేశాల వారి లైఫ్ స్టైల్‌ను ప్రపంచమంతా అనుసరిం చాలంటే.. ఏకంగా ఎనిమిది, తొమ్మిది భూగ్రహాలు అవసరం పడతాయట.
అమెరికా, యూరప్ ఖండాల్లోని అత్యధిక దేశాల్లో వినియోగం ఎక్కువగా ఉందని.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో తక్కువగా ఉందని సర్వే తేల్చింది. ఈ దేశాల విస్తీర్ణం, జనాభా ఎక్కువగా ఉండటంతో మొత్తం ప్రపంచవ్యాప్త సగటు వినియోగం తగ్గుతోందని.. ఆ మేరకు ధనిక దేశాలు వనరులను ఎక్కువగా వాడేసుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఇండోనేసియా ప్రజల లైఫ్ స్టైల్‌ను ప్రపంచమంతా అనుసరించినా.. మన భూమి ఒక్కటి సరిగ్గా సరిపోతుందట. ఇక మన జీవన విధానాన్ని ప్రపంచమంతా ఫాలో అయితే.. భూమిలో 70% వనరులు చాలట.
ఈ దేశాలవారి లైఫ్ స్టైల్‌ను ప్రపంచమంతా అనుసరిస్తే.. ఎన్ని భూగ్రహాలు కావాలి?
Comments
Please login to add a commentAdd a comment