ఆ ఇజ్రాయెల్‌ గ్రామంలో యూదు- పాలస్తీని భాయీ భాయీ! | Jews and Palestinians Live Like Brothers in this Israeli Village | Sakshi
Sakshi News home page

Israel Hamas War: ఆ గ్రామంలో యూదు- పాలస్తీని భాయీ భాయీ!

Published Sat, Oct 28 2023 9:09 AM | Last Updated on Sat, Oct 28 2023 12:04 PM

Jews and Palestinians Live Like Brothers in this Israeli Village - Sakshi

ఇజ్రాయెల్- హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేలాది మంది మరణించారు. వీరిలో వందలాది మంది చిన్నారులు కూడా ఉన్నారు. హమాస్‌ అకస్మాత్తుగా యూదు దేశం ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అనంతరం ఇజ్రాయెల్ అన్ని వైపుల నుండి గాజా స్ట్రిప్‌పై దాడి చేస్తోంది. కాగా పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య ఈ వివాదం కొత్తది కాదు. దశాబ్దాల నాటి శత్రుత్వం అలా కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటం ఇజ్రాయెల్ ఏర్పాటుతో ప్రారంభమైంది. ఇది నేటికీ ముగియలేదు. అయితే వివాదాల నడుమ ఒక గ్రామం విశేషంగా నిలిచింది. ఈ గ్రామంలో ఇజ్రాయెల్- పాలస్తీనా ప్రజలు ఐక్యంగా మెలుగుతున్నారు. 

జెరూసలేం- ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మధ్య ఒక గ్రామం ఉంది. ఇక్కడ వేలాది మంది యూదులు, పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఇక్కడ ఈ రెండు వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. ద్వేషానికి దూరంగా మెలుగుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ, ఈ గ్రామంలోనివారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, కలసిమెలసి జీవిస్తుంటారు. 

బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రామం పేరు వాల్ అల్ సలామ్. అరబిక్‌లో దీని అర్థం శాంతి ఒయాసిస్. ఈ గ్రామంలో 70కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో యూదులు- అరబ్బులు కూడా ఉన్నారు. ఇరు దేశాల్లో శాంతిభద్రతలను కోరుకునే కుటుంబాల వారు మాత్రమే ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. వీరు గ్రామంలో ఒకరిపై మరొకరు ఎటువంటి వివక్ష చూపరు. ఈ గ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఇందులో యూదు, అరబిక్ కమ్యూనిటీలకు చెందిన పిల్లలు కలిసి చదువుకుంటున్నారు.

తొలుత ఈ గ్రామంలో కేవలం నాలుగు కుటుంబాల వారు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడసాగారు.ఈ గ్రామంలోని జనాభా నిరంతరం పెరుగుతూ వస్తోంది. ఇజ్రాయెల్- పాలస్తీనాలకు ఐక్యతా సందేశాన్ని అందించేందుకు కొందరు గ్రామంలో ఉంటూ, ఇందుకోసం విశేష కృషి చేస్తున్నారు. ఏదో ఒక రోజు  ఇరుదేశాల్లోని ద్వేషం మాయమై శాంతి వర్థిల్లుతుందని వారు ఆశిస్తున్నారు. 
ఇది కూడా చదవండి:  ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement