NATO Secretary-General Jens Stoltenberg: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(నాటో) సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ తమ(నాటో) కూటమిలోని ఏ దేశంపై అయినా రష్యా దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ కూటమి దేశాల్లోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నాటో ప్రతినిధులు గురువారం అత్యవసర భేటీ నిర్వహించారు. అనంతరం స్టోల్టెన్‌బర్గ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా సమీపంలోని తమ సభ్య దేశాల్లో భద్రతను పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: (Russia Ukraine War Affect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?)
సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా నాటో సభ్యదేశాల అధినేతలు శుక్రవారం వర్చువల్‌గా సమావేశమవుతారని, తాజా పరిణామాలపై చర్చిస్తారని వెల్లడించారు. రష్యా రాక్షస చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. యూరప్‌లో శాంతి భగ్నమై, యుద్ధం తలెత్తడం పట్ల స్టోల్టెన్‌బర్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాటో కూటమి ప్రపంచ చరిత్రలోనే అత్యంత బలీయమైన శక్తి అని అభివర్ణించారు. తమ కూటమిలో ఏ ఒక్క దేశం జోలికి రష్యా వచ్చినా మిగతా దేశాలన్ని కలిసికట్టుగా బుద్ధి చెబుతాయని తేల్చిచెప్పారు.
చదవండి: (Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?)
Comments
Please login to add a commentAdd a comment