Putin on receiving peace offer: గత నెలరోజుల తరబడి రష్యా ఉక్రెయిన్‌పై దాడి సాగిస్తూనే ఉంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ దాడులన్నింటిని తిప్పికొడుతోంది కూడా. అయితే ఇన్ని రోజులైన ఇంకా ఉక్రెయిన్ లొంగకపోయేసరికి ఆక్రోశంతో ఫాస్ఫరస్ వంటి భయంకరమైన మారణాయుధాలను ప్రయోగించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఇంకెన్ని భయంకరమైన బాంబులను ప్రయోగిస్తుందేమోనన్న భయంతో ముఖాముఖిగా శాంతి చర్చలకు అని పిలుపు నిచ్చారు.
ఈ మేరకు జెలెన్ స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి తన స్వహస్తాలతో ఒక లేఖ కూడా రాశాడు. రష్యా ఒలిగార్చ్, అనధికారిక శాంతి నిర్మాత రోమన్ అబ్రమోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతితో రాసిన లేఖను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి అందజేశారు. దీంతో పుతిన్ మేము వారిని ఎలాగైనా దెబ్బకొట్టగలం అని అతనికి చెప్పు అన్నారు. అయితే ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు సహయం చేయాలన్న జెలెన్ స్కీ అభ్యర్థనను రష్యన్ ఒలిగార్చ్ రోమన్ అబ్రమోవిచ్ అంగీకరించారు కూడా. అయితే రోమన్ అబ్రమోవిచ్, ఉక్రెనియన్ శాంతి సంధానకర్తలతో శాంతిచర్చల్లో భాగంగా ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో సమావేశం అయినప్పుడూ విషపూరిత రసాయన దాడి జరిగిందంటూ ది వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.
అంతేకాదు వారు ఆ విషప్రయోగం కారణంగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. అయితే ప్రస్తుతం వారు బాగానే ఉన్నారని కూడా నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా కాగా, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య తొలి ముఖాముఖి చర్చలు మంగళవారం టర్కీలో జరగనున్నాయని ఉక్రెనియన్ అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రధాన లక్ష్యం కాల్పుల విరమణ అని నొక్కి చెబుతోంది. అంతేకాదు తాము తమ సొంత గడ్డ లేదా దేశ సార్వభౌమాధికారాన్ని వ్యాపారం చేయడం లేదు అని ఉక్రెనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఈ దాడి ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 3.5 మిలియన్ల మంది ప్రజలు వలస వెళ్లిపోగా వేలల్లో పౌరులు, చిన్నారులు, సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment