
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని చసివ్ యార్ పట్టణాన్ని పూర్తిగా తమ సైన్యం నియంత్రణలోకి తీసుకుందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. చసివ్ యావ్ పట్టణం.. బఖ్‌ముట్ పట్టణానికి పశ్చిమాన 20కిల్లో మీటర్ల దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది.
అయితే తాజాగా ఈ పట్టణంపై తమ సైన్యం పూర్తి నియంత్రణ సాధించినట్లు రష్యా ప్రకటించింది. ‘రష్యా సౌత్ గ్రూప్ సైన్యం.. దాడులు చేసి.. నోవీ జిల్లాలోని చసివ్ యార్ పట్టణాన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. అక్కడ నుంచి సైన్యం మిగత సెక్టర్ల వైపు వెళ్తోంది’’ అని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అయితే రష్యా ప్రకటనపై ఉక్రెయిన్ స్పందిస్తూ.. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతోందని తెలిపింది.
బుధవారం ఉక్రెయన్ 24 బ్రిగేడ్ మీడియా అధికారి ఇవాన్ పెట్రేచాక్ మాట్లాడారు. ‘‘ సివర్స్కీ డోనెట్స్ పట్టణానికి నోవీ జిల్లా తూర్పు వైపు ఉంది. డాన్‌బాస్ కాలువకు పశ్చిమ ఉంది. డాన్‌బాస్ కెనాల్ చుట్టూ ఉక్రెయిన్ సైనికులు.. రష్యా సైన్యంతో పోరాడుతున్నారు.
..ఈ పోరాటం కొంత కఠినమైంది. రష్యా చేస్తున్న దాడుల్లో తగ్గుదల కనిపించటం లేదు. రాకెట్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే 25 బ్రిగేడ్ బలగాలు తమ స్థానంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment