రైలు వస్తుండగా పట్టాలపై పడితే ఇక అంతే సంగతులు.. పొరపొటునో, ఆత్మహత్యాయత్నం చేసుకునే క్రమంలో రైలు కింద పడిన సందర్భాలు ఎక్కువగా వింటూ ఉంటాం. కాగా, ఒక మనిషిని హత్య చేయాలనే ఉద్దేశంతో రైలు పట్టాలపైకి తోసిన ఘటన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో ఏమౌతుందో అనిపించే ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే వీడియో వైరల్‌గా మారింది.
అసలు విషయంలోకెళ్తే...బ్రస్సెల్స్‌లో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను ఎదురుగా వస్తున్న రైలు ముందుకి తోసాడు. అయితే రైలు సకాలంలో ఆగిపోవడంతో మహిళ గాయపడకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బ్రస్సెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన మొత్తం స్టేషన్‌లోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది.
ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ దుండగుడు మహిళను పట్టాలపై తోసేయడానికి ముందు అక్కడ ఉన్న ఫ్లాట్‌ఫాం కలియ తిరుగుతాడు. ఆ తర్వాత ఆ మహిళ వద్దకు వచ్చి ఎదురుగా వస్తున్న రైలు ముందుకు తోస్తాడు. ఆ ఘటనతో షాక్‌కు గురైన మహిళ పట్టాలపై పడిపోయి షాక్‌లో ఉండిపోతుంది. అయితే ఆ ట్రైయిన్ డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేక్ వేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ దుండగడు మాత్రం ఆ మహిళను తోసేపి వెంటనే పారియినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. ఈ మేరకు బ్రస్సెల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆ దుండగుడిని వెంటనే వేరొక మెట్రో స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment