అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు జోబైడెన్ ప్రస్తుత ప్రపంచ రాజకీయా స్థితిని విషతుల్యంగా ఉన్నాయని తరచుగా చెబుతుంటారు. ఇలాంటి స్థితిలో
ప్రజలకు ప్రజావస్వామ్య వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థలలో ఏదో ఒకటి ఎన్నుకునే సందిగ్ధ స్థిత ఏర్పడటమో లేదా ప్రపంచాన్ని పూర్తిగా మార్చే ఆవశ్యకతను గుర్తించడమో జరుగుతుందన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు నాయకుడిగా జీవితాంతం ఉండాలని యోచిస్తున్నాడంటూ ఆందోళన లేవనెత్తారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వంగా పిలిచే కథనం నేటి ప్రంపచాన్ని నిర్వచించలేకపోవచ్చు కానీ కాలపు ధోరణిని మాత్రం సూచిస్తుందని బైడెన్‌తో అన్నారు. అలాగే తమ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మానవాళి తదితరాలు గురించి సదా అన్వేషిస్తోందని చెప్పారు.
అలాగే అమెరికాలో అమెరికా స్టైల్‌లో చైనాలో చైనీస్ స్ట్రైల్‌లో ప్రజాస్వామ్యం ఉంటుందని బైడెన్‌కి గట్టి కౌంటరిచ్చారు జిన్‌పింగ్. ఐతే మానవహక్కుల సంఘాలు, పాశ్చాత్య నాయకులు, విద్యావేత్తలు జిన్‌పింగ్‌ని నియంతృత్వం అని పిలిచే చైనీస్ పార్టీకి నాయకుడని విమర్శిస్తారు. చైనాలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛ మీడియాతో సహా జాతీయ కార్యాలయానికి సార్వత్రిక ఓటు హక్కు లేదని, పైగా పార్టీ విమర్శకులు ఆన్‌లైన్ సెన్సార్ చేయబడటం లేదా ఆఫ్‌లైన్‌లో నిర్బంధించబడటం వంటివి జరుగుతాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
గతేడాది జో బెడెన్ ఈ అంశాలపై వర్చువల్ సదస్సు కోసం సుమారు 100 మంది ప్రపంచ నాయకులను ఆహ్వనించారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని స్వాగితిద్దామా? లేదా మనమంతా ఒకే విజన్‌ని కిలిగి ఉందామా అని నాయకులకు పిలుపునిచ్చారు. ఆ సదస్సులో మానవ పురోగతి, మావన స్వేచ్ఛను ముందుకు నడిపించలా వద్దా అనే దానిపై ప్రసంగించారు. ఐతే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఆహ్వానించకపోవడంతో దీన్ని విభజన అంటూ కామెంట్లు చేసింది చైనా. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ 2021 చివరిలో ముప్పులో ఉన్న ప్రజాస్వామ్య దేశాల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment