Viral Video Of Ukrainian: Father Saying Goodbye To His Daughter Shows Heartbreaking - Sakshi
Sakshi News home page

Russia-Ukraine Crisis: హృదయ విదారకం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Published Fri, Feb 25 2022 9:36 AM | Last Updated on Fri, Feb 25 2022 10:59 AM

Viral Video Of Ukrainian Father Saying Goodbye To His Daughter Shows Heartbreaking - Sakshi

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దళాలు విరుచుకుపడుతున్నాయి. పకడ్బందీగా రష్యా జరుపుతున్న ముప్పేట దాడిలో నలిగి ఉక్రెయిన్‌ విలవిల్లాడుతోంది. గురువారం తెల్లవారుజామున రాజధాని కీవ్‌పై మొదలైన దాడులు చూస్తుండగానే పలు ప్రాంతాలక విస్తరించాయి. రా ఓ వైపు బాంబుల మోతతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. బాంబుల వర్షం కురుస్తుండటంతో కార్లు, తదితర వహనాల్లో ఉన్నపళాన బయల్దేరారు. దీంతో ఎక్కడ చూసినా భారీ ట్రాఫిక్‌ జామ్‌లు కన్పించాయి. కొన్నిచొట్ల పిల్లలను చంకనెత్తుకొని పెద్దవాళ్లను పట్టుకొని వీలైన చోట్లకు జనం పారిపోతూ కనిపించారు.  

ఉక్రెయిన్‌లో రష్యా బాంబుల మోత, కాల్పుల శబ్ధాలతో హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. దాడిలో గాయపడిన వారి దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఓ తండ్రి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిని గుండెకు హత్తుకొని కన్నుల నిండా బాధ, ప్రేమతో ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
చదవండి: రష్యాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్‌

కూతురు బస్సు ఎక్కి వెళ్లిపోతుంటే కూడా తన చేతులను బస్సు అద్దంపై పెట్టి తండ్రి కంటతడి పెట్టుకోవడం చూడొచ్చు. తండ్రి కంటతడి పెట్టడం చూసిన కూతురు, పక్కనే ఉన్న మహిళ కూడా వెంటనే ఏడవటం ప్రారంభించారు. అయితే ఈ దృశ్యాలు ఎక్కడ జరిగాయనే విషయంపై క్లారిటీ లేదు. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం వీడియో గుండెలు పిండేసేలా ఉందంటూ.. యుద్ధ తీవ్రతకు ఈ  దృశ్యాలు అద్దం పడుతున్నాయంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థులు.. సీఎం ఏమన్నారంటే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement