విషాదం: గ్రైండర్‌లో పడి నలిగిన మహిళ | Woman Stuck In Poultry Factory Grinder In Russia | Sakshi
Sakshi News home page

విషాదం: గ్రైండర్‌లో పడి నలిగిన మహిళ

Feb 11 2021 8:46 PM | Updated on Jul 5 2022 12:17 PM

Woman Stuck In Poultry Factory Grinder In Russia - Sakshi

వీడియో దృశ్యం

మాస్కో : కోళ్ల ఫాంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ నిండు ప్రాణం బలైంది. ఫాంలోని గ్రైండర్‌లో పడి ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ సంఘటన రష్యాలోని జుకోస్కిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలెవ్‌సోవోకు చెందిన ఓ మహిళ అక్కడి కోళ్ల ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతోంది. కొద్దిరోజుల క్రితం ఫ్యాక్టరీలోని గ్రైండర్ దగ్గర పనిచేస్తోంది.‌ కోళ్లను(మాంసం) ఒక కన్వేయర్‌నుంచి మరో కన్వేయర్‌కు మారుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె  చెయ్యి గ్రైండర్‌లో ఇరుక్కుంది. ( మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..)

తీయటానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. సెకన్లలో మహిళ మొత్తం గ్రైండర్‌లోకి వెళ్లిపోయింది. తోటి పనివాళ్లు ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోళ్ల ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. అధికారులు సంఘటనకు సంబంధించిన సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన వీడియోను తాజాగా విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement