లండన్: 2020 విచిత్రమైన సంవత్సరం. కరోనా సంవత్సరంగా పేరొందిన 2020లో ఎన్నో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా కరోనా విజృంభిస్తూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఎంతో మంది ఉపాధిని కూడా కోల్పోయారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండలేక కొంతమంది మహిళలు తమకు నచ్చిన కుట్లు, అల్లికలతో లాక్‌డౌన్‌లో వారిని వారు బిజీ చేసుకున్నారు. ఇక 2020 ముగియడంతో కొత్త ఆశలు, నూతన ఉత్తేజంతో 2021లోకి అడుగుతున్న పెడుతున్న సందర్భంగా బ్రిటన్‌కు చెందిన రచయిత, ఆర్టిస్టు జోసి జార్జ్ 2020లో లాక్‌డౌన్‌లో తను అల్లిన ఉలెన్ కండువాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా సరదాగా కోసం మొదలు పెట్టిన కండువా 2020 ముగిసేసరికి దాదాపు మూడు మీటర్ల పోడవు అయ్యిందంటూ ట్విటర్ వేదికగా ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 650 అడుగులకొండపై నుంచి పడిపోయిన మహిళ..)
Well here it is: 2020's weather. 3m, 732 rows (2 rows=1 day), 70,368 stitches, 1kg of wool. My small world and I have sat together every day; I witnessed its dramas and joys and it witnessed mine. Now I get to see this cycle play out all over again, all new. What a gift that is. pic.twitter.com/rxKEYxvKVU
— Josie George (@porridgebrain) January 1, 2021
‘2020 ముగిసింది. 3మీ, 732 వరుసలు (రోజుకు రెండు వరుసలు) 70,368 కుట్లు, ఒక కేజీ ఉలెన్. నా చిన్న ప్రపంచంలో ప్రతి రోజు రెండు వరుసలుగా అల్లుతూ 2020 చివరకు 3మీ చేశాను. రంగురంగులతో ఈ కండువాను అందంగా దిద్దితూ కండువాలో వస్తున్న మార్పులను చూసి మురిసిపోయాను. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇది నా సొంతం’ అంటూ జార్జ్ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్ చూసిన మహిళ నెటిజన్‌లు తాము కూడా లాక్‌డౌన్ ఇదే చేశామంటూ వారు అల్లిన ఉలెన్ స్వెటర్, తలగడ కవర్, కండువాలను పోస్టు చేస్తున్నారు. దీంతో కేవలం జార్జ్ ఒక్కరే కాకుండా ప్రపంచంలోని చాలా మంది మహిళలు లాక్‌డౌన్‌లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘బిజీ బిజీ లైఫ్ కారణంగా హస్తకళ నైపుణ్యాలను పక్కన పెట్టిన మహిళలకు కరోనా మళ్లీ కుట్లు, అల్లికలను గుర్తు చేసింది. కరోనా మంచిదే’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: 2020లో అతి జుగుప్సాకరమైన క్రైం ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment