
శాస్త్రవేత్తల పొలంబాట
కోరుట్లరూరల్: మండలంలోని సంగెం, యెఖీన్‌పూర్ గ్రామాల్లో వరి పొలాలను జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. వరిలో మొగి పురుగు, అగ్గి తెగులు సోకినట్లు గుర్తించారు. మొగిపురుగు నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ ఎకరాకు 400 గ్రాములు, అగ్గి తెగులు నివారణకు ఇస్రోప్రోథియోలిస్ 300 మిల్లీలీటర్ల మందును 180 నుంచి 200లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలన్నారు. యూరియాను మూడు దఫాలుగా వేసుకోవాలన్నారు. జింక్ లోపానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని, సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని తగ్గించటానికి మొక్కవేర్లకు గాలి తగిలేలా మురుగు నీటిని తొలగించి మళ్లీ నీరందించాలని వివరించారు. కాంప్లెక్స్, అమ్మోనియం ఎరువులను వాడద్దన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శ్రీనివాస్, బలరాం, రవి, మండల వ్యవసాయ అధికారి నాగమణి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment