అక్రమాలపై విచారణ చేపట్టండి
మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్ సహకార సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ బీసీ, ఎస్సీ, ఎస్టీ సన్నకారు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సంఘం ఎదుట నిరసన తెలిపారు. డీసీవో మనోజ్‌కుమార్‌కి ఫిర్యాదు చేశారు. సహకార సంఘంలో 2014 నుంచి 2025 వరకు జరిగిన సర్వసభ్య సమావేశాలు, రైతుల మహాజన సభల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలతో తేలినా అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆడిట్ అధికారులు రూ.1.26కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు నివేదించినా రికవరీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమాలకు పాల్పడిన సంఘం అధికారులు, చైర్మన్లపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే జిల్లా సహకార కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment