నేటినుంచి దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాలు
సారంగాపూర్: జిల్లాలోని దుబ్బరాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ బ్రహ్మోత్సవాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించిడంతో ఇటీవలే కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేసిన విషయం తెల్సిందే. తాగునీరు, టెంట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పారిశుధ్యం కోసం 100 మందిని నియమించారు. వైద్యం, నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కంట్రోల్ రూం, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీలకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జగిత్యాల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడపనుంది. స్వామివారి కల్యాణం, మహాశివరాత్రి, రథోత్సవం రోజున భక్తులు లక్షల సంఖ్యల్లో హాజరవుతారని ఈవో వడ్లూరి అనూష, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకయ్య తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాల్లో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఉత్సవాలు ఇలా
24న సాయంత్రం స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, 25న రాత్రి స్వామివారి కల్యాణం, 26న మహాశివరాత్రి జాగరణ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ, రుద్రాభిషేక నిషిపూజ, 27న పారణ, మధ్యాహ్నం అన్నపూజ, 28న ఉదయం స్వామివారి రథోత్సవం ఉంటుంది.
ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు
సమన్వయంతో ముందుకు సాగుతున్న అధికారులు
కలెక్టర్ ఆదేశాలతో భక్తులకు సరిపడా ఏర్పాట్లు
24న స్వస్తి పుణ్యాహవచనంతో అంకురార్పణ
25 స్వామివారి కల్యాణం..
26న మహాశివరాత్రి.. 28న స్వామివారి రథోత్సవం
నేటినుంచి దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment