యూరియా కోసం ఆందోళన వద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగి సీజన్‌కు 38 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 36 వేల టన్నుల యూరియా తెప్పించామన్నారు. రైతుల నుంచి డిమాండ్ దృష్ట్యా రెండు రోజులుగా మంచిర్యాల నుంచి 500 టన్నులు, తిమ్మాపూర్ నుంచి 1000 టన్నులు, జనగామ నుంచి 500టన్నుల యూరియా తెప్పించి సొసైటీలకు సరఫరా చేశామని పేర్కొన్నారు. సోమవారం మరో 1300 టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు.
కాంగ్రెస్‌తోనే తెలంగాణ
జగిత్యాలరూరల్: నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో రాజకీయాలకు అతీతంగా ఉద్యమించామని, దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కేసీఆర్‌ను ఉద్యమనాయకుడిగా భావించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ప్రజలు అవకాశం కల్పించారని, కానీ కేసీఆర్ మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని పేర్కొన్నారు. మార్పులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించారని, ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 56వేల ఉద్యోగాలు కల్పించదన్నారు. త్వరలోనే గ్రూప్స్, డిపార్ట్‌మెంట్, అంగన్‌వాడీ, మెగా డీఎస్పీ నోటిఫికేషన్ రాబోతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు జున్ను రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందన్న, నాయకులు పెద్దన్న, వెంకన్న, యూత్ కాంగ్రెస్‌నాయకులు పాల్గొన్నారు.
శ్రీకనకసోమేశ్వర స్వామికి శోభాయాత్ర
మల్లాపూర్: మహాశివరాత్రి, శ్రీకనకసోమేశ్వర స్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి శోభాయాత్ర చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం మాట్లాడుతూ ఈనెల 28 వరకు స్వామివారి జాతర మహోత్సవాలు ఉంటా యని వివరించారు.
యూరియా కోసం ఆందోళన వద్దు
యూరియా కోసం ఆందోళన వద్దు
Comments
Please login to add a commentAdd a comment