అగ్నిమాపక కేంద్రానికి మోక్షమెప్పుడో..?
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని 32 గ్రామాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం 2012లో దివంగత మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు హయాంలో అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2014లో కాంట్రాక్ట్ ముగియడంతో అగ్నిమాపక యంత్రం రాయికల్ నుంచి తరలిపోయింది. గతంలో అగ్నిమాపక భవనంతోపాటు, సిబ్బంది కోసం గదులను స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్మించారు. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం తరలిపోవడంతో వైకుంఠదామం రథాన్ని ఉంచుతున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లినా కలగని మోక్షం
అగ్నిమాపక కేంద్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లి సుమారు ఏడాది గడుస్తోంది. అయినా ఎలాంటి కదలిక లేదు. అగ్నిమాపక కేంద్రం ఉంటే రాయికల్, మల్లాపూర్, మేడిపల్లి మండలాల్లో అగ్నిప్రమాదాల నివారణకు దోహదపడుతుంది. ఇందుకు రూ.5 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ పలుమార్లు సీఎం, సంబంధిత శాఖ అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. రాయికల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అగ్నిప్రమదాలు జరిగినా జిల్లా కేంద్రం నుంచి అగ్నిమాపక యంత్రం రావాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ లోపు భారీగా ఆస్తినష్టం వాటిల్లుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లినా కదలని ఫైల్
తరచూ అగ్నిప్రమాదాలతో ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment