‘ఎల్‌ఆర్‌ఎస్’కు మోక్షం
● 25 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ● ప్లాట్ల క్రయవిక్రయాలకు మంచి మార్గం ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ● వచ్చేనెల 31వరకు గడువు
జగిత్యాల: ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తులకు మోక్షం కలిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతిచ్చినప్పటికీ చాలామంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నా యి. తాజాగా అక్రమ లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ప్లాట్ల క్రయవిక్రయాలకు మంచి మార్గం ఏర్పడింది. ఈ మేరకు సర్కారు రాయితీ కూడా ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు చేసుకున్న దరఖాస్తులు మున్సిపాలిటీల్లో పేరుకుపోయాయి. రూ.వెయ్యి చెల్లించిన వందలా ది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దరఖా స్తులు అలాగే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకొచ్చాక ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వడంతో కొంతమంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. అయినా చాలావరకు దరఖాస్తులు అలాగే మిగిలిపోయాయి. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం వన్‌టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) విధానానికి శ్రీకారం చుట్టింది. 25 శాతం రాయితీ ప్రకటించింది. వచ్చేనెల 31వరకు తగిన రుసుం చెల్లించి ప్లాట్ల ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ మే రకు అధికారులు కూడా ప్రజల్లో అవగాహన కల్పి స్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అవకాశాన్ని వినయోగించుకోవాలని కోరుతున్నారు.
ఇది మంచి అవకాశం
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వడంతోపా టు రాయితీ ప్రకటించడంతో ప్రజలకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అనుమతి లేని ప్లాట్లను కొనుగోలు చేసుకున్నప్పుడు ఇళ్లు కట్టుకుందామంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాక బ్యాంక్‌లో లోన్ పెట్టుకుందామన్నా ఎల్‌ఆర్‌ఎస్ ప్రధానం. ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే రుణం మంజూరవుతుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాలని బల్దియా అధికారులు కోరుతున్నారు.
వచ్చిన దరఖాస్తులు 27,369..
పరిష్కారమైనవి 1714
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 27,369 దరఖాస్తులు రాగా 1714 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 25,655 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో 411 రిజెక్ట్ అయ్యాయి. ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన పత్రాలు జతచేయనివి 22,519 దరఖాస్తులున్నాయి. వీటికి సంబంధించిన పత్రాలను కార్యాలయానికి వెళ్లి చూపిస్తే వాటిని కూడా అధికారులు అప్రూవ్ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment