కూలీల సమస్యకు చెక్
జిల్లాలో పసుపు తవ్వకాలు పూర్తయ్యాయి. రైతులు పసుపును ఉడకబెట్టి మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడకబెట్టేందుకు అన్నదాతలు ఆధునాతన ఆవిరి యంత్రాలవైపు దృష్టి సారిస్తున్నారు. కొన్ని యంత్రాలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలకు సబ్సిడిపై అందిస్తుండగా.. రైతులు బృందాలుగా ఏర్పడి కొంటున్నా రు. ప్రస్తుతం గ్రామానికి ఒకటి రెండు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డ్రమ్ముకు రూ. 100 నుంచి రూ.150 వరకు తీసుకుంటున్నారు. ఈ యంత్రంలో రోజులోనే 100 నుంచి 150 డ్రమ్ముల పసుపు ఉడుకబెట్టవచ్చు. యంత్రంలో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ఉంటుంది. ఇరువైపులా నాలుగు డ్రమ్ములు ఉంటాయి. వీటిని పైపుల ద్వారా నీటి ట్యాంక్‌కు అనుసంధానం చేస్తారు. పసుపును ముందుగా నాలుగు డ్రమ్ముల్లో నింపుతారు. నీటి ట్యాంక్ కింద కట్టెలతో మంట పెడుతారు. ట్యాంక్‌లోని నీరు మరిగిన తర్వాత పైపుల ద్వారా నీటి ఆవిరి పసుపు కొమ్ములు ఉన్న డ్రమ్ముల్లోకి వెళుతుంది. డ్రమ్ముల కింది భాగంలో ఓపెన్ చేసి ఉడికిన కొమ్ముల్ని ఆరబోస్తారు. – జగిత్యాలఅగ్రికల్చర్
Comments
Please login to add a commentAdd a comment