ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించారు.
డీఎస్సీ–2008 అభ్యర్థులకు నియామక పత్రాలు
జగిత్యాల: డీఎస్సీ–2008 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించినట్లు డీఈవో రాము తెలిపారు. 2008లో ఎంపికై న 40 మంది అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి కౌన్సెలింగ్ ద్వారా ఉత్తర్వులు అందించామని వెల్లడించారు.
పాఠశాలల తనిఖీ
కథలాపూర్: మండలంలోని సిరికొండ, కథలాపూర్ జెడ్పీ హైస్కూళ్లతోపాటు ఎంఈవో కార్యాలయాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలకు ప్రభుత్వం అందించిన ఐఎఫ్‌బీ బోర్డులను బోధనకు వినియోగిస్తున్నారా..? లేదా..? అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన ఎస్సెస్సీ ఫలితాలు తెలుసుకొని ఈసారి వందశాతం ఉత్తీర్ణతకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, ఇన్‌చార్జి హెచ్‌ఎంలు రవికుమార్, వెంకటేశం ఉన్నారు.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్
సారంగాపూర్: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ అని, వారి సంస్కృతి, సంప్రదా యాలను కాపాడిన గొప్ప వ్యక్తి అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని ధర్మనాయక్‌తండాలో సేవాలాల్ జయంతిని నిర్వహించారు. సేవాలాల్ ఆలయంలో పూజలు చేశారు. సేవాలాల్ ప్రకృతి ప్రేమికుడని, సంఘ సంస్కర్త అని కొనియాడా రు. ఆయన వెంట బంజారాల పెద్దలు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత సేవాలాల్ ఆలయంలో పూజలు చేశా రు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలు గా గుర్తించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.
‘నవోదయ’కు కోరుట్లలో సర్వే
కోరుట్ల: జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గం పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాటు కోసం సర్వే నిర్వహించిన చొప్పదండి నవోదయ పాఠశాల ప్రతినిధుల బృందం.. శనివారం కోరుట్ల పట్టణానికి వచ్చింది. పట్టణ శివారులోని జంబిగద్దెల సమీపంలో ఉన్న 58 ఎకరాల స్థలంలో సుమారు 30 ఎకరాల స్థలాన్ని నవోదయకు కేటాయించే విషయంలో సర్వే నిర్వహించారు. ఈ స్థలం కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉండటం, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్లు సమాచారం.
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురిలో భక్తుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment