భక్తులకు సరిపడా ఏర్పాట్లు
వెల్గటూర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు కంపెనీ నిర్మించిన శాశ్వత షెడ్, టాయిలెట్స్‌ను ప్రారంభించారు. బందోబస్తు చేపట్టాలని సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment