పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

Published Sun, Feb 16 2025 1:21 AM | Last Updated on Sun, Feb 16 2025 1:19 AM

పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

పకడ్బందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

జనగామ: వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జి ల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ హాలులో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌తో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ విధానంపై సెక్టార్‌, ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పా ల్గొని మాట్లాడారు. జిల్లాలో 1,002 ఉపాధ్యాయ ఓట్లకు గాను 12 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలక్షన్‌ నేపధ్యంలో జిల్లాలో మూ డు మండలాలకు ఒక రూట్‌ చొప్పున నాలుగు రూ ట్లను ఏర్పాటు చేయగా, నలుగురు సెక్టోరియల్‌ అ ధికారులను నియమించినట్లు చెప్పారు. మొదటి రూట్‌లో జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాలు ఉండగా, రెండవ రూట్‌లో కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి, మూడవ రూట్‌ పరి ధిలో చిల్పూర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌, నా లుగవ రూట్‌ పరిధిలోకి నర్మెట, బచ్చన్నపేట, తరి గొప్పుల మండలాలు ఉన్నట్లు వెల్లడించారు.

అధికారుల పాత్ర కీలకం

ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణ లో ఎలక్షన్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ అ న్నారు. 17 మంది పీఓలు, 18 మంది ఏపీఓలు, 37 మంది ఓపీఓలు, 18 మంది మైక్రో అబ్జర్వర్‌ల పర్యవేక్షణలో ఎలక్షన్‌ నిర్వహించనున్నామన్నారు. అధి కారుల సమన్వయంతో పని చేసి పొరపాటుకు తా వులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలను నిర్వహించనున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నెల 27న పోలింగ్‌

ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, సాయంత్రం ఓటింగ్‌ ముగిసే సమయంలో క్యూ లైన్‌లో ఉన్న వారికి టోకెన్‌ నంబర్లను ఇచ్చి, ఓటింగ్‌ వేసేలా చూడాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్‌ బాక్స్‌లను ఓపెన్‌ చేసి చూపించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అధి కారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకు ముందు ఎన్నికల నిర్వహణపై సెక్టార్‌ అధికారులు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు మాస్టర్‌ ట్రేనర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీకాంత్‌, క లెక్టరేట్‌ ఏఓ మన్సూరి, సెక్టార్‌ అధికారులు, ఎన్ని కల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ నిర్వహణపై

అవగాహన కలిగి ఉండాలి

పీఓలు, ఏపీఓలు, ఓపీఓల పాత్ర కీలకం

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

జనగామ రూరల్‌: పదోతరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అందుకు కా ర్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్‌ పాఠశాలలో ఎస్సీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై ప్రేరణ–అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమయాన్ని వృథా చేయకుండా ప్రతీక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వార్షిక పరీక్షల సన్నద్ధతకు ఆరు సూత్రాలను తప్పనిసరిగా అనుసరించాలని, వాటిలో యాక్షన్‌ ప్లాన్‌, స్మార్ట్‌ వర్క్‌, ఆ రోగ్యం, మంచి నిద్ర, సాధన, ప్రేరణ వంటి సూత్రాలను పాటిస్తూ ప్రతీ విద్యార్థి పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ డీఓ విక్రమ్‌, మైనార్టీ సంక్షేమ ప్రిన్సిపాల్స్‌ కుమారస్వామి, అనిల్‌, ఎస్సీ, బీసీ వసతి గృహా ల అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement