నీళ్లు లేవనడం కాంగ్రెస్ చేతగాని తనం
ఖిలా వరంగల్: రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి ‘వరి సాగు చేయొద్దు.. నీళ్లు లేవని చెప్పడంకాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారంవరంగల్ బొల్లికుంట ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యాన ఉపాధ్యాయ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాశేశ్వరం ప్రాజెక్ట్‌ను 50 శాతం కేసీఆర్ నాశనం చేస్తే.. మిగిలిన 50శాతం కాంగ్రెస్ నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లు లేక 7లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయిందని, యూరియా పుష్కలంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేత కావటం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఆసరా, రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే ఇ చ్చారు.. నేటికీ 2లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. టీచర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్‌ఫిట్స్ ఇవ్వలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచే యోచనలో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉపాధ్యాయులు చైతన్యవంతులై బీజేపీ బలపర్చిన అభ్యర్ధి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, సత్యపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, తిరుపతిరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment