ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్
జనగామ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు, సంస్కృతీ సంప్రదాయాలు పరస్పరం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం అమలు చేస్తోంది. తెలంగాణలో 3 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు హర్యానా(హర్యాన్వీ) భాష.. అలాగే హరియాణాలో తెలంగాణ భాష, సంప్రదాయాలు, తదితర విషయాలను నేర్పిస్తున్నారు. నవోదయ గురుకులాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యాలయాల్లో చదువుకునే పిల్లలు పదోతరగతి లోపు ఒక సంవత్సరం ఎంపిక చేసిన రాష్ట్రంలో చదువుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వారిలో అవగాహన పెంపొందించేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ప్రత్యేక నిధుల కేటాయింపు
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉండగా, 40వేల మంది పిల్లల వరకు చదువుకుంటున్నారు. ప్రత్యేక భాష నేర్పించడానికి ‘పీఎం శ్రీ’ పథకం కింద ఎంపికై న 15 పాఠశాలలకు రూ.10వేలు, మిగతా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.వెయ్యి చొప్పున కేంద్రం గ్రాంట్ విడుదల చేసింది. ప్రత్యేక రోజులు, రెగ్యులర్ బోధన తరగతులకు ఆటంకం కలుగకుండా అనుభవం కలిగిన హిందీ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో హర్యానా భాషా నేర్పించాల్సి ఉంటుంది. అక్కడి రాష్ట్రంలోని విభిన్న వంటకాలు, సంగీతం, నృత్యం, హస్తకళలు, క్రీడలు, సాహిత్యం, పండుగలు, చిత్రలేఖనం, కవితలు, జానపద పాటల, అక్షరమాలలు, స్వాతంత్య్ర సమరయోధులు, భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర ప్రాధాన్యత అంశాలు, పంటలు, చారిత్రక పరిస్థితులు, సామెతలు తెలిసేలా పి ల్లలకు హరియాణా రాష్ట్ర భాషలోని 100 వాక్యాలను నేర్పించాలి. అలాగే ఆ రాష్ట్ర భాషలో ప్రదర్శించే సినిమాలను సైతం చూపించాలి. పిల్లలు నేర్చున్న విషయాలపై తెలుసుకునేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. సంస్కృతీ సంప్రదాయాలు, భాష నేర్పేందుకు క్లబ్‌లు ఏర్పాటు చేసి.. కన్వీనర్‌గా(హెచ్‌ఎం) కోకన్వీనర్‌గా(హిందీ టీచర్), ప్రతీ తరగతి నుంచి సభ్యులు(ఐదుగురు విద్యార్థులు) పర్యవేక్షిస్తారు.
తెలంగాణలో హర్యానా భాషా,
ఆ రాష్ట్రంలో తెలుగు బోధన
ప్రాథమిక స్థాయి నుంచి అన్ని
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు
సంస్కృతీ సంప్రదాయాలు పరస్పరం తెలిసేలా ప్రత్యేక కార్యాచరణ
Comments
Please login to add a commentAdd a comment