బాబోయ్ వానర సైన్యం
జనగామ మండలం యశ్వంతాపూర్‌లో వానరసైన్యం దడ పుట్టిస్తున్నాయి. వందలాది కోతులు కలిసికట్టుగా కాలనీలన్నీ చుట్టేస్తూ ఎవరినీ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా గుమ్మం ముందే తిష్ట వేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తూ.. పెంకుటిళ్లను గుల్ల చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులను బయటకు పంపించాలంటే వణికిపోతున్నారు. తల్లిదండ్రులు దగ్గరుండి తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. కోతుల నుంచి కాపాడాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు.
– జనగామ
Comments
Please login to add a commentAdd a comment