నేడు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం
జనగామ: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నేడు (సోమవారం) రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందు కు సంబంధించి భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, రైతుల ఖాతాలకు నేరుగా సొమ్ము వచ్చి చేరుతుంది. జిల్లాలో సుమారు 53వేల మంది రైతులు పీఎం కిసాన్‌కు అర్హత పొందారు. 19వ విడతలో ఒక్కో రైతుకు రూ.2వేల చొప్పున రూ.10.60కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా కాకుండా, కేంద్రం సపరేట్‌గా ఏడాదికి మూడు సార్లు రూ.2వేల చొప్పున రూ.6వేల పెట్టుబడి సాయం వస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరిసాగు సమయంలో యూరియా, కలుపు తీత, ఇతర పనులకు పెట్టుబడి సాయం అవసరపడుతుంది.
జిల్లాలో లబ్ధిపొందనున్న
53వేల మంది రైతులు
నేడు జమవుతాయి..
కేంద్రం అందిస్తోన్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 19వ విడత నేడు రైతుల ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో ఈ పథకం కింద 53 వేల మంది రైతులు ఉన్నారు. ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందుతుంది.
– రామారావు, జిల్లా వ్యవసాయాధికారి
నేడు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం
Comments
Please login to add a commentAdd a comment