సేవ్ బర్డ్స్
ఇంటిపై పాత్రలో తాగునీరు, గింజలను ఏర్పాటు చేసిన మణి
● పక్షుల దాహార్తిని తీర్చేందుకు
సెల్ఫీ విత్ వాటర్ ఫర్ చాలెంజ్
జనగామ: వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు అమ్మ ఫౌండేషన్ వినూత్న రీతిలో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేవ్ బర్డ్స్–సెల్ఫీ విత్ వాటర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి చాలెంజ్‌ను స్వీకరిస్తూ, ముఖ్య సలహాదారులు వంగ భీమ్‌రాజ్‌కు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై మట్టి పాత్ర లేదా గిన్నెలో నీరు పోసి, ఆహార గింజలను అందించి పక్షుల దాహార్తి, ప్రాణాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీఒక్కరు పక్షుల ప్రాణాలు కాపాడేందుకు అమ్మ ఫౌండేషన్ చేపట్టిన యజ్ఞంలో భాగస్వామ్యులుగా చేరి మనలోని మానవత్వాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment