జోరుగా బెట్టింగ్
జనగామ: దాయాదుల పోరుతో మరోసారి బెట్టింగ్‌లకు తెరలేపింది. చాంపియన్ ట్రోఫీ–2025లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో భారత్ వరెస్స్ పాకిస్తాన్ తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభానికి టాస్ వేసిన సమయం నుంచి రాత్రి మ్యాచ్ ముగిసే వరకు ఆన్‌లైన్ వేదికగా జోరుగా బెట్టింగ్ జరిగినట్లు ప్రచారం జరిగింది. బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగి జిల్లా కేంద్రం, ఆయా మండలాల పరిధిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా క్రికెట్ అభిమానుల నుంచి బెట్టింగ్‌లో పాల్గొనే విధంగా ఎర వేసినట్లు చర్చ జరిగింది. మొదటగా టాస్ ఎవరు గెలుస్తారనే దానిపై రూ.5వందల నుంచి రూ.5వేల వరకు బె ట్టింగ్ చేయగా.. గెలుపొందిన వారికి డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించినట్లు మాట్లాడుకోవడం కనిపించింది. మొదటి ఓవర్ నుంచి చివరి 50వ ఓవర్ వ రకు బెట్టింగ్ జరుగగా, పాకిస్తాన్ వికెట్లు కుప్పకూలి పోతున్న సమయంలో బాల్ బాల్‌కు పోటీ పెరిగిన ట్లు సమాచారం. బెట్టింగ్‌ను నగదు రూపంలో కా కుండా, యాప్‌ల ద్వారా నడిపించినట్లు తెలుస్తుంది. కొంతమంది మాత్రం రూ.5 నుంచి రూ.10 ల క్షల వరకు బెట్టింగ్ ద్వారా సంపాదించుకున్నారనే మాటలు వినిపించాయి. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ తతంగంలో సూత్ర, పాత్రదారులు ఎవరనే దానిపై పలువురు అభిమానులు బహిరంగంగానే ముచ్చటించుకున్నారు. ఇదిలా ఉండగా ఇండి యా బ్యాటింగ్ దిగగానే..వందశాతం గెలుస్తుందని భారీగా బెట్టింగ్ కాయగా... చివరి వరకు ఇదే తంతు కొనసాగిందని సమాచారం. దీనిపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం.
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబా య్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని స్వాగతిస్తూ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డతో పాటు ఆయా కాలనీలు, మండలాల్లో క్రికెట్ అభిమానులు బాణాసంచా పే ల్చి, జాతీయ జెండాలతో జై భారత్ అంటూ నినదించారు. విరాట్ కొహ్లీ సెంచరీతో ఇండియా గె లుపొందిన తర్వాత.. అభిమానులంతా ఎంజాయ్ చేస్తూ దావత్‌లు చేసుకున్నారు.
ఫోర్, సిక్స్‌కు ఓ రేటు.. వికెట్‌కు మరో రేటు
అంతా ఆన్‌లైన్‌లోనే..
భారత్ గెలుపుతో సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment