ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
● డీఐఈఓ జితేందర్‌రెడ్డి
జనగామ రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని డీఐఈఓ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసి సమావేశానికి డీఐఈఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. రాబో యో వార్షిక పరీక్షలకు సబ్జెక్టుల వారీగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రా యాలన్నారు. సబ్జెక్టులో సమస్యలు ఉంటే పరిష్క రించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, కాపర్తి శ్రీనివాస్, మహమ్మద్ ముక్తాదిర్, షహనాజ్ తారనం, సబిహా బేగం, తిరుమలేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment