ఆర్టీసీకి ‘మహా’ కలెక్షన్లు●
● జనగామ డిపో పరిధిలో
రూ.16.50 లక్షల ఆదాయం
● ఉద్యోగులను అభినందించిన
మేనేజర్ స్వాతి
జనగామ: మహా శివరాత్రి పర్వదినం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర నేపథ్యంలో ఆర్డీసీ జనగామ డిపోకు టికెట్ కలెక్షన్లు దండిగా వచ్చాయి. డిపో మేనేజర్ ఎస్.స్వాతి ఆధ్వర్యాన ఫిబ్రవరి 25 నుంచి 28వ తేదీ వరకు కొమురవెల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించారు. జనగామ బస్టాండ్ నుంచి 60 బస్సులు.. 518 ట్రిప్పులు.. 23,310 కిలోమీ టర్ల మేర ప్రయాణించి 16,959 మంది భక్తులను సురక్షితంగా తరలించారు. టికెట్ కలెక్షన్ల ద్వారా రూ.16.50 లక్షల ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వాతి మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపించడంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పేర్కొ న్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెయింటనెన్స్ విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment