ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
పక్క ఫొటోలో కనిపిస్తున్న యువ రైతు జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జి)కి చెందిన బత్తిని ప్రకాశ్. యాసంగి సీజన్‌లో బోరు బావి కింద ఆధారపడి మూడు ఎకరాల్లో వరి అర ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. పంటల సాగు కోసం రూ.79వేల పెట్టుబడి పెట్టాడు. భూగర్భ జలాలు అడుగంటి, ఉన్న ఒక్కబోరు ఒట్టి పోవడంతో పొట్టదశకు వచ్చిన పంట ఎండిపోయింది. దీంతో మూడు ఎకరాల పంటను పశువులకు మేతగా వదిలేశాడు. పెట్టుబడులు కూడా రాని దయనీయస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.
●
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment