● 7 నుంచి 21కి పెరిగిన వైకల్య సేవలు
● జిల్లా జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు చర్యలు
జనగామ: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న సదరం సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ(యూనిక్ డిజబులిటీ ఐడీ) కార్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏడు కేటగిరీల్లో సదరం సర్టిఫికెట్లు అందిస్తుండగా.. ఇక నుంచి 21 కేటగిరీలకు సంబంధించి యూడీఐడీ కార్డులు ఇవ్వనుంది. ఈ సేవలను ఈనెల 1వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది. వైకల్య పరీక్షల నిర్వహణకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుతో పాటు ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ మహిపాల్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, డాక్టర్లతో కలిసి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment